అగ్రస్థానానికి జియో








న్యూఢిల్లీ: సబ్‌స్క్రైబర్ల సంఖ్య పరంగా దేశంలోనే అతి పెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్‌ జియో  అవతరించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ Výæణాంకాల ప్రకారం.. గతేడాది నవంబర్‌ చివరినాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరింది. 33.62 కోట్ల చందాదారులతో ఆ తరువాత స్థానంలో వొడాఫోన్‌ ఐడియా, 32.73 కోట్ల యూజర్లతో ఎయిర్‌టెల్‌ మూడో స్థానంలో ఉంది. మొత్తం టెలికం యూజర్ల సంఖ్య అక్టోబర్‌లో 120.48 కోట్లు ఉండగా.. నవంబర్‌ చివరినాటికి 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు పరిమితమైంది.