లండన్: పాప్ స్టార్ డఫ్ఫీ.. యునైటెడ్ కింగ్‌డమ్ సామ్రాజ్యానికి పరిచయం అక్కర్లేని పేరు. తన అద్భుత గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్రిటీష్ గాయని కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయింది. దీంతో ఆమె అభిమానులు డఫ్ఫీ ఎక్కడ? ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు? అని గొంతెత్తి అరిచినా లాభం లేకపోయింది. కానీ ఓ జర్నలిస్టు ఆమె కోసం అన్వేషణ ప్రారంభించి, ఆచూకీ కనుగొన్నాడు. తీరా ఆమెను పలకరించగా గాయనికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని ద్రవించిపోయాడు. ఆమెకు ఎంతగానో ధైర్యం చెప్పడంతో తిరిగి పదేళ్ల తర్వాత డఫ్ఫీ అభిమానులతో మనసు విప్పి మాట్లాడింది. తన గతం గురించి చెప్తూనే వర్తమానం, భవిష్యత్తు గురించి కలలు కంటోంది.
సంచలన గాయనికి చెప్పుకోలేని చేదు అనుభవం!