న్యూఢిల్లీ : దేశంలో ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించే 18 రకాల పరీక్షల కిట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో మూడు రకాల కిట్లను పుణేలోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ వైరాలజి’ తయారు చేయగా, మిగతా 15 కిట్లకు ఇతర దేశాలు ఇచ్చిన లైసెన్సులు, సర్టిఫికెట్ల ఆధారంగా భారత్ ప్రభుత్వం సత్వర అనుమతి మంజూరు చేసింది. ఈ 18 రకాల కిట్ల తయారీకి, మార్కెటింగ్‌కు అనుమతి మంజూరు చేసినట్లు భారత డ్రగ్ కంట్రోలర్ జనరల్ వీజీ సోమని మీడియాకు తెలియజేశారు. ఇంతవరకు ఇలాంటి కిట్లు చాలినన్నీ అందుబాటులో లేకపోవడం వల్ల ఇప్పటి వరకు కేవలం 26 వేల మందికి మాత్రమే కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించగలిగారు. అందుకే వీటికి కేంద్రం సత్వర అనుమతిని మంజూరు చేయాల్సి వచ్చింది. 18 కిట్లలో 15 కిట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు కూడా కేంద్రం అనుమతించినట్లు వీజీ సోమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. (చదవండి: కరోనా నిర్ధారణ నిమిషాల్లోనే!)
కరోనా పరీక్షలకు 18 కిట్లకు అనుమతి