లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో బోర్ కొట్టకుండా ఉండేందుకు జనాలు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కాదు. వంటింటి మొహం కూడా చూడనివారు గరిటె పడుతుండగా, అందాన్ని నిగారింపు చేసేందుకు దొరికిన సమయాన్ని కాస్తా కొత్త కొత్త టిప్స్‌తో సద్వినియోగం చేసుకుంటున్నారు. వీలు దొరికితే పజిల్స్ అంటూ, కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ కాలాన్ని గడిపేస్తున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మరో కొత్త ఛాలెంజ్ వచ్చింది. అదే గమ్చా చాలెంజ్. నెటిజన్లు అధికంగా ఇష్టపడుతున్న ఈ చాలెంజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. (కరోనా ఎఫెక్ట్; వీడియో కాల్‌తో విషెస్)
ఇంట్లో గమ్చా చాలెంజ్ ట్రై చేయండి..